రైతులను ఇబ్బంది పెడితే సహించేది లేదు : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

రైతులను ఇబ్బంది పెడితే సహించేది లేదు : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నల్గొండ, వెలుగు : రైతులను ఇబ్బంది పెడితే సహించేది లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బుధవారం నల్గొండ జిల్లా కనగల్, నల్గొండ మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులను ఇబ్బందులకు గురిచేసే మిల్లర్లు, అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎండల తీవ్రత దృష్ట్యా ధాన్యం సేకరణను వేగవంతం చేయాలని, అవసరమైతే రాత్రి వేళల్లో లైట్లు ఏర్పాటు చేసి కొనుగోళ్లు జరపాలని అధికారులను ఆదేశించారు.

కనగల్, ఎడవల్లి కేంద్రాల్లో లారీల కొరతను వెంటనే తీర్చాలని కాంట్రాక్టర్లకు సూచించారు.   తమది రైతు ప్రభుత్వమని, సన్న రకానికి రూ. 500 బోనస్ ఇస్తున్నామని, ఐకేపీ మహిళా సంఘాల కోసం 30 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోడౌన్లను నిర్మిస్తామని మంత్రి ప్రకటించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను కలెక్టర్ రోజూ సమీక్షించాలని, మిల్లర్లు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.